పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుఁ డను భ్రాంతిచే కాలయవనుఁడు ముచుకుందుని లేపుట

“ఓరి! గోపాలక! ర్వక వెఱచి
దూరించి వెడఁగు సందులుఁ జొచ్చి యచట
నిద్రపోయినఁ బోదునే? నిన్ను దీర్ఘ
నిద్రఁ బుచ్చెద”నంచు నిగుడి తాఁకుటయుఁ
బెద్దకాలము నిద్రఁ బేర్చిన పుణ్యుఁ 
ద్దురాత్ముఁడు చావ ట మేలుకాంచి
యీక్షింపఁ గాలాగ్నియెరఁ గాలయవనుఁ 
డాక్షణంబున భస్మమైపోయె” ననుఁడు